జిల్లాకు 20 వ్యవసాయాధికారుల పోస్టుల మంజూరు
శ్రీకాకుళం, జూలై 30 : జిల్లాకు 20 వ్యవసాయాధికారుల పోస్టులు మంజూరయ్యాయి. వీటిని భర్తీ చేయడంతో పాటు ఏడీఏలకు పీఏలుగా ఏవోలను నియమించనున్నారు. వ్యవసాయాధికారుల నియామకాల పట్ల ఏవో సంఘం ప్రతినిధులు బి.వి.తిరుమలరావు, ఎం.రవికిరణ్‌లు హర్షం వ్యక్తం చేశారు. జోన్-1కి 43 పోస్టులు మంజూరు కాగా జిల్లాకు 20 పోస్టులు కేటాయించారు.