జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

గద్వాల నడిగడ్డ, జులై 22 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజా, ప్రతినిధులు కలెక్టర్, ఆర్డీవో ప్రత్యేక చొరవ తీసుకొని కొత్త జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని బి ఆర్ ఎస్, టి యన్ ఎస్ ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో సాంకేతిక విద్యను అభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నారని, ఇంజనీర్లు డాక్టర్లు టెక్నీషియన్లు వందల మంది ఉన్నారనీ, ప్రభుత్వం కొత్త జిల్లా కేంద్రాలలో ప్రత్యేక చొరవ తీసుకొని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని, కొత్త జిల్లాలకు ప్రత్యేక పారిశ్రామిక అభివృద్ధి నిధులను కేటాయించాలనీ, ఈ జిల్లాలో ముఖ్యంగా చేనేత పరిశ్రమలను, కాటన్ భేల పరిశ్రమలను,దారం పరిశ్రమలను డెవలప్ చేయాలి, ఫుడ్ పార్కులను, వైద్య సంబంధమైన పరిశ్రమల కేటాయించాలనీ, మత్స శాఖ పరిశ్రమలను అభివృద్ధి చేయాలనీ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పెద్ద ఎత్తున కేటాయించాలనీ, లేదంటే జిల్లాలో ఉండే విద్యావంతులైన యువత నిర్వేర్యం అయ్యే ప్రమాదం ఉన్నదనీ, లేదంటే యువత పెద్ద ఎత్తున నిరసనలకు దిగే అవకాశం ఉన్నదనీ, కొత్త జిల్లాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం నుండి ప్రత్యేక నిధులను రాబట్టాలనీ వారన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే, వినోద్ కుమార్, వాల్మీకి, జిల్లా నాయకులు వకీల్ దామోదర్, వేణు, టి యన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్, జిల్లా ఉపాధ్యక్షులు గంజిపేట రాకేష్ తదితరులు పాల్గొన్నారు.