జిల్లాలో వరద పరిస్థితులపై కవిత ఆరా

అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన
కలెక్టర్‌ నారాయణరెడ్డితో ఫోన్‌లో సంభాషణ
వర్షృాలతో శ్రీరాంసాగర్‌కు వరదపోటు
నిండిన చెవురులు కుంటలతో మత్తళ్లు

నిజామాబాద్‌,జూలై11(జనం సాక్షి ):నిజామాబాద్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, స్పెషల్‌ ఆఫీసర్‌ క్రిస్టినాతో ఎమ్మెల్సీ కవిత ఫోన్‌లో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్‌ సౌకర్యం, ఇతర మౌళిక సదుపాయాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సత్వర కార్యచరణ రూపొందించాలని ఎమ్మెల్సీ కవిత ఆదేశించారు. నందిపేట్‌, సిరికొండ, బోధన్‌ నియోజకవర్గాలకు మంజూరు చేసిన ప్రత్యేక అంబులెన్స్‌లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కవిత సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. నష్టాలను అంచనా వేసి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. వరదముంపు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన ఆఫీసర్‌ క్రిస్టినా మధ్యాహ్నం నిజామాబాద్‌ లో పర్యటించనున్నారు. లోతట్టు ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఎమ్మెల్సీ కోరారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు 9 వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ ఇన్‌ఎª`లో 85,740 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా… ప్రస్తుతం 1087అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 75 టీఎంసీలుగా కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌ ఔట్‌ ప్లో 41 వేల క్యూసెక్కులుగా ఉంది. జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరద ముంచెత్తుతోంది. మహారాష్ట్రతో పాటు శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శ్రీరామసాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1087 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు గేట్ల ను ఎత్తడంతో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు నిర్ణయించారు. అలాగే నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలోకి ఎవరూ వెళ్లొద్దని
విజ్ఞప్తి చేశారు. జిల్లాలో నవీపేట మండలంలో అత్యధికంగా 217 మి.విూల వర్షం పడిరది. వర్షాలకు జిల్లా అంతటా వరదలు పోటెత్తుతుండడంతో.. చెరువుల్లోకి భారీగా నీళ్లు చేరాయి. జిల్లాలోని సరిహద్దు కందకుర్తి వద్ద త్రివేణి సంగమం వరదతో పోటెత్తగా..అక్కడ ఉన్న పాత శివాలయం నీట మునిగింది.సాలూర`మంజీరా వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనను తాకుతూ నీరు ప్రవహిస్తుండడంతో.. అధికారులు బ్రిడ్జిని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో తెలంగాణ`మహారాష్ట్రకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో చెరువులు నిండడంతో పాటు మత్తళ్లు పారుతున్నాయి. పలుచోట్ల కుంటలు, చెరువుల మత్తళ్ల గండ్లు పడ్డాయి. చెరువుల కాల్వలు తెగిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు పారుతుండడంతో
రాకపోకలకు అంతరాయం ఏర్పడిరది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమేష్‌కుమార్‌ సూచించారు. ఆదివారం ఆయన వీడియో కాన్పరెన్స్‌ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్‌పీలతో వరద పరిస్థితుపై సవిూక్షించారు. అలాగే ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా క్రిస్టినా జడ్‌ చోంగ్తూను ప్రభుత్వం నియమించింది. ఆమె జిల్లాలో వరద ఉధృతి, పంట నష్టం తదితర అంశాలను పరిశీలించి అధికారులతో సవిూక్షించనున్నారు. సహాయ చర్యలను చేపట్టేందుకు అధికారులను అప్రమత్తం చేయనున్నారు.