జిల్లాస్థాయిలో విలీన ఉపాధ్యాయుల సమావేశం.
మాచారెడ్డి జనం సాక్షి..
ఎన్జీవోఎస్ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో శనివారం రోజున విలీన ఉపాధ్యాయుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ విలీన ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని దివ్యాంగ విద్యార్థుల పట్ల మానవతా దృష్టితో వారికి అందవలసిన సదుపాయాలను కల్పించాలని సూచించారు .అంతేకాకుండా రాష్ట్ర మార్గదర్శకాల మేరకు నడుచుకోవాలని అన్నారు. విలీన విద్య సమన్వయకర్త శ్రీపతి మాట్లాడుతూ భవిత కేంద్రాలను బలోపేతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా సెక్టోరల్ ఆఫీసర్ దొడ్ల మనోహర్ మాట్లాడుతూ విలీనా విద్య ఉపాధ్యాయుల యొక్క సేవలను కొనియాడారు విద్యార్థులకు మరిన్ని సేవలు అందించడానికి జిల్లా భవిత కేంద్రాలకు 25 వేల రూపాయలు విరాళం అందజేసి తన దాదృతo చాటుకున్నార్. జిల్లా ఐ. ఈ. ఆర్. పి. ల తరఫున మనోహర్ కు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరల్ అధికారులు గంగా కిషన్, వేణు శర్మ కామారెడ్డి మండల విద్యాధికారి ఎల్లయ్య, ఐ.ఈ.ఆర్.పి లు, దామోదర్ ,వెంకటేష్, సారిక, భక్తమాల, రమేష్ వెంకటేష్, తదితరులు, పాల్గొన్నారు.