జిల్లా ఎస్పీని కలిసిన దళిత జర్నలిస్టుల ఫోరం బృందం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్8(జనంసాక్షి):
దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆధ్వర్యంలో శనివారం నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ కే.మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగిన ఉమ్మడి జిల్లా దలిత జర్నలిస్టుల ఫొరం సమావేశానికి హాజరయ్యారయిన నాయకులందరు సమావేశం అనంతరం జిల్లా ఎస్పి ని వారి చాంబర్ లో కలిసి పూలమాలలు వేసి శాలువాతో సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ కే.మనోహర్ మాట్లాడుతూ జర్నలిస్ట్ వృత్తి చాలా పవిత్రమైనదని జర్నలిస్టులు అంటే దారి తప్పిన వారికి దారి చూపే విధంగా ఉండాలని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజా సమస్యలపై నిరంతరం శ్రమించి ప్రజలను చైతన్యపరిచే విధంగా ఉండాలని ఆయన సూచించారు.పత్రిక అనేది ఒక్కరి పక్షాన ఉండకుండా ప్రజాపక్షాన ఉండి ప్రజా అభ్యుదయం కొరకు పాటుపడేలా ఉండాలని సూచించారు.ఈ సన్మాన కార్యక్రమంలో డి జె ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఔట శ్రీనివాస్, టీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లు శేఖర్, మరియు అనిల్,జయ ప్రకాష్, డి జె ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్,గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకట్,నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షు డు అవుట వెంకటేష్, కల్వకుర్తి మండల అధ్యక్షుడు నరేష్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహ,బంగారయ్య, వరప్రసాదు,కురుమూర్తి,పట్టాభి, పరశురాం తదితరులు పాల్గొన్నారు.