జిల్లా కేంద్రంలోని అతిథిగృహ స్థలంలో అన్ని వసతులతో కూడిన బీసీ సంక్షేమ వసతి గృహాలను నిర్మించాలి.
ఎంఎల్ఏ విద్యార్థుల వసతిగృహాలను సందర్శించాలి.
బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్19(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న ప్రభుత్వ అతిథి గృహ స్థలంలో బీసీ సంక్షేమ హాస్టల్ భవనాలను నిర్మించాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ ర్నూల్ జిల్లా కన్వీనర్ డి. అరవింద్ చారి డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ అతిథి గృహం కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా అరవింద్ చారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం చిన్న జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి జరుగుతుందని ఏర్పాటు చేశారని,కాని విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు.నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వ వసతి గృహాలు ప్రైవేటు భవనాల్లో నిర్వహించడం వల్ల వారికి సరియైన వసతులు లేక బాత్రూమ్స్ నీటి సమస్య విద్యుత్ కొరత తలుపులు కిటికీలు సరిగా లేకపోవడం దాదాపు ఒక రూముకు 25 మంది చొప్పున పడుకుం టున్నారని అన్నారు.కాబట్టి వసతులకు అనుగుణంగా హాస్టళ్లకు సొంత భవనాలు ఉంటే బాగుంటుందని ఇంతకుముందు ఉన్న కలెక్టర్లు శ్రీధర్, ఎల్. శర్మన్ లకు, ప్రస్తుతం ఉన్న కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కు మరియు బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్ కు వసతి గృహాలకు సొంత భవనాలు కావాలని పలుమార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. కలెక్టరేట్ ముట్టడి ధర్నాలు రిలే నిరాహార దీక్షలు రాస్తారోకోలు చేసిన ఫలితంగా ప్రభుత్వం నుంచి విద్యార్థుల వసతిగృహాలు ఏర్పాటు చేపట్టడానికి బడ్జెట్ మంజూరు చేసిందని అన్నారు. జిల్లా కేంద్రంలో ఎక్కడైనా స్థలం ఉంటే భవనాలు కట్టిస్తామని అధికారులు చెబుతున్నారని తెలిపారు.దానికి అధికారులు స్థలాన్ని చూయించడంలో జాప్యం చేయడంతో వచ్చిన నిధులు తిరిగి వెళ్ళిపోయాయని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంతవరకు ఒక్క బీసీ సంక్షేమ హాస్టల్ లను సందర్శించింది లేదుని, విద్యార్థుల బాగోగులు అడిగింది లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందిస్తూ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఉన్న ప్రభుత్వ అతిథి గృహస్థలంలో బీసీ సంక్షేమ హాస్టల్ ల భవనాలను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నే బీసీ సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఉంచాల్సిన వస్తుందని అన్నారు.విద్యార్థుల సమష్యలపై బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అరవింద్ చారి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎం. శివకుమార్, ఆనంద్, సిహెచ్ ఆంజనేయు లు,బి.రాజు, పి.నితిన్, ఎం.మహేష్ బాబు, మల్లేష్, యశ్వంత్, సునీల్, లింగం, గణేష్, లక్ష్మణ్, సతీష్, వై.అంజి,మోహన్, దిలీప్, సిహెచ్. రామాంజనేయులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.