జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.
ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, విద్యార్థినిలు.
యువతులకు ఏమైనా సంఘటనలు జరుగుతే వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలి.
మున్సిపల్ చైర్పర్సన్ కల్పన భాస్కర్ గౌడ్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్24(జనంసాక్షి):
రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమైన బొడ్డెమ్మ వేడుకలను శనివారం సాయంత్రం నాగర్ కర్నూల్ పట్టణంలోని క్రీడా మైదానం లో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పెళ్లి కానీ యువతులతో ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్పర్సన్ కల్పన భాస్కర్ గౌడ్ హాజరయ్యారు. బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. అంటూ ఆడబిడ్డలు సందడి చేశారు.పితృ అమావాస్య వరకు వేడుకలు నిర్వహిస్తుండ గా, చిన్నారులు, యువతులు, మహిళలు ఆడిపాడారు. పిల్లల పండుగగా బొడ్డెమ్మను, పెద్దల పండుగగా బతుకమ్మను జరుపుకోవ డం ఆనవాయితీగా సందడి నెలకొంది.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లా డుతూ యువతులకు ఏమైనా సంఘటన లు జరిగితే వెంటనే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు సంప్రదించాలన్నారు.బాల్య వివాహాలను అరికట్టేలా అవగాహన కల్పించారు.ప్రతి అమ్మాయి 21 సంవత్సరా ల పూర్తయిన తర్వాతనే తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేయాల న్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారిని వెంకటలక్ష్మి, జిల్లా భూగర్భ జల అధికారిని రమాదేవి మార్కెటింగ్ అధికారిని బాలమని సెక్టోరల్ అధికారిని సూర్య చైతన్య, వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో యువతులు మహిళలు పిల్లలు పాల్గొన్నారు.