జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష.

సోనియా,రాహుల్ గాంధీ పై కక్ష సాధింపు.
గాంధీ కుటుంబం పై కేసులు పెడితే భయపడేది లేదు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను పల్లె పల్లెకు తీసుకెళ్తాం.

డీసీసీ అధ్యక్షులు డా.వంశీకృష్ణ.
జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి.
నియోజకవర్గ ఇంచార్జి డా.నాగం శశిధర్ రెడ్డి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జులై 27(జనంసాక్షి):
కేంద్రంలో ని బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ల పై ఈడీ విచారణ పేరుతో కక్షసాధింపు చర్యలకు పాలుపడుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి,నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి లు కేంద్రంలో ని బిజెపి ప్రభుత్వం పై మండిపడ్డారు.బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు.ఈ సందర్భంగా డా.వంశీకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని అవలంబిస్తూ ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.2015లో సుప్రీంకోర్టు కొట్టి వేసిన నేషనల్ హెరాల్డ్ కేసును తిరగతోడి త్యాగాల కుటుంబాన్ని వేధింపుల పేరుతో అవస్థలకు గురి చేయడం సరికాదని విమర్శించారు.మోడీ ప్రభుత్వం పది లక్షల కోట్ల భారం వేసిందని మండిపడ్డారు. సందర్భంగా గాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ అక్రమ వేధింపులు నిలిపివేయాలని సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరిగిందన్నా రు.కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచేలా ధరలను పెంచి మోసం చేస్తుంటే రాష్ట్రంలోని కేసిఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ముసుగులో లక్షల కోట్లు స్వాహా చేసిందని ఆరోపించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి: ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి మాట్లాడుతూ తెలంగాణ ను ఇచ్చిన సోనియా ను కేంద్రంలోని ప్రభుత్వం ఈడిని అడ్డం పెట్టుకొని ఇబ్బంది పెట్టడం దారుణం అని అన్నారు.గాంధీ కుటుంబం పై కేసులు పెడితే భయపడేది లేదని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేసీఆర్ పాలనను గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని కోరారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఇంచార్జి డా.నాగం శశిధర్ రెడ్డి:
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నందుకే తమ నేతలపై బిజెపి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాలుపడుతుందని విమర్శించారు.కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రం లో ని కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను పల్లె పల్లెకు తీసుకెళ్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తిమ్మాజీపేట్ పాండు,తాడూర మండల పార్టీ ప్రెసిడెంట్ ఐతోల్ లక్ష్మయ్య,తెలకపల్లి మండల సర్పంచ్ బాలగౌడ్,సీనియర్ నాయకులు నారాయణ గౌడ్, బాలా గౌడ్, కౌన్సిలర్లు ఎండీ నిజాముద్దీన్, తీగల సురేంద్ర, సుల్తాన్,నాయకులు సలీం, శ్రీనివాసరావు,అర్జునయ్య, నాగులయ్య, రమేష్ రావు, భీముడు, ప్రవీణ్,రవి,అహ్మద్ కొల్లాపూర్ అచ్చంపేట కల్వకుర్తి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.