జిల్లా కోసం ముస్లింల ప్రత్యేక ప్రార్ధనలు:-
మిర్యాలగూడ. జనం సాక్షి
మిర్యాలగూడ జిల్లా ఏర్పడాలని ఆకాంక్ష..
మిర్యాలగూడను జిల్లాగా చేయాలని కోరుతూ మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని చిన్న మసీదులో శుక్రవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక జిల్లా ఏర్పడితే మిర్యాలగూడ పరిసర ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందనీ, ఉన్నత విద్య వైద్యం అందుబాటులోకి వస్తుందని ముస్లిం పెద్దలు పేర్కొన్నారు. మిర్యాలగూడ జిల్లా ఏర్పడాలని ప్రజలు ఎంతో కాలంగా కోరుకుంటున్నారని వారి ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జిల్లా ఏర్పాటు కోసం జరిగే కార్యక్రమాలలో ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో ముఫ్తీ ఇమ్రాన్,హఫీజ్ పాష, అహ్మద్ చావుస్, మహమ్మద్ ఇమ్రాన్, ఇసాక్, రహీం, ఫారుక్,మోసిన్ జిల్లా సాధన సమితి సభ్యులు మాలోతు దశరధ నాయక్ తాళ్లపల్లి రవి,రిషికేశ్ రాజు,బంటు వెంకటేశ్వర్లు చేగొండి మురళి యాదవ్, జయరాజు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.