జిల్లా క‌లెక్ట‌ర్ వాట్సప్ డిపి పేరుతో ఫేక్ మెసేజ్‌లు.

 

 

 

 

 

 

 

 

 

 

-జిల్లా అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.
– క‌లెక్ట‌ర్ పి. ఉదయ్ కుమార్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్13 (జనంసాక్షి):
జిల్లా క‌లెక్ట‌ర్‌ పేరుతో గ‌త కొద్దిరోజులుగా వ‌స్తున్న ఫేక్ మెసేజ్‌ల ప‌ట్ల జిల్లా ఉన్న‌తాధి కారులు, జిల్లా ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నాగర్ కర్నూల్ జిల్లా క‌లెక్ట‌ర్ పి ఉదయ్ కుమార్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సూచించారు.జిల్లా క‌లెక్ట‌ర్ ప్రొఫైల్ ఫొటోతో, సెల్ నెంబ‌ర్ +916026712814 నుంచి వాట్సాప్ ద్వారా, పలు ఆదేశాలు,సూచ‌న‌లు వెలువ‌డుతున్నాయ‌ని,వీటితో జిల్లా యంత్రాంగానికి ఎటువంటి సంబంధ‌మూ లేద‌ని స్ప‌ష్టం చేశారు.ఈ ఫోన్ నంబర్లు నుంచి వచ్చే ఆదేశాలను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని జిల్లా అధికారుల‌కు, సిబ్బందికి, ప్ర‌జ‌ల‌కు సూచించారు.ఇలా ఎవరికైనా మెసేజ్ లు వచ్చినట్లయితే, తమ ఉన్నతాధికారులకు సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.