జిల్లా పర్యాటకంపై నీలినీడలు
జలపాతాల వద్ద సౌకర్యాలు మృగ్యం
ఆదిలాబాద్,మే14(జనం సాక్షి): జిల్లా పర్యాటకానికి ఆయువుపట్టుగా ఉన్న జలపాత ప్రాంతాలను అభివృద్ది చేయడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆదిలాబాద్ అడవులకు అందాన్ని ఇచ్చి, పర్యాటకానికి ప్రాణం పోస్తున్న కుంటాల, పొచ్చెర జలపాతాల పరిస్థితి దారుణంగా మారింది. వర్షాకాలం వచ్చిందంటే పచ్చదనంతో ఆహ్లాదంగా ఉండే పరిసరాలు కానరావడం లేదు. కుంటాల, పొచ్చెర జలపాతాలపై నేతల హావిూలు అమలు కావడం లేదు. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులకు నిరాశే ఎదురవుతోంది. మౌలిక వసతులు లేకపోవడమే కారణమని పర్యాటకులు వాపోతున్నారు. కుంటాల ప్రాంతం కవ్వాల్ టైగర్ జోన్, బఫర్‌జోన్‌లోకి రావడంతో అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహణ ఉంది. దీంతో పర్యాటక శాఖ వారు పట్టించుకోవడం లేదు. ఈ శాఖల మధ్య సమన్వయం లోపంతో ఇక్కడ కనీస వసతులు మెరుగుపడడం లేదు. కుంటాలలో మెట్లకు మరమ్మతులు నాసిరకంగా చేయడంతో రెండేళ్లకే కాలం చెల్లిపోయి పగుళ్లు తేలాయి. చాలా చోట్ల మెట్లు విరిగి పోయాయి. పక్కన కట్టిన రక్షణ గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. జలపాతం వద్దకు వెళ్లేందుకు ఈ మెట్లే ఆధారం. అవి నిలువుగా ఉండడంతో దిగడానికి సందర్శకులు అవస్థలు పడుతుంటారు. పదేళ్ల కిందట అభివృద్ధి పనులు చేపట్టడంతో ప్రస్తుతం అవి ఆనవాళ్లను కోల్పోయాయి. ఆదిలాబాద్ పర్యాటకానికి తలమానికంగా నిలిచే ఈ జలపాతాల అభివృద్ధికి తీసుకోవాల్సిన
చర్యలపై అధికార నేతలు పట్టించుకోవం లేదు. కుంటాల, పొచ్చెరతో పాటు బోథ్ నియోజకవర్గంలోని సప్త జలపాతాలను టూరిజం కారిడార్గా చేస్తామని ప్రకటించారు. ప్రతి జలపాతానికి నిధులు కేటాయించి అభిసే సౌభాగ్యం కలుగుతుందని ఆశించారు. దిలాబాద్ నుంచి వెళ్తున్న 44వ జాతీయ రహదారిపై నేరడిగొండ 42
కిలోవిూటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి 14 కిలోవిూటర్ల దూరంలో కుంటాల, 10 కిలోవిూటర్ల దూరంలో పొచ్చెర జలపాతాలు ఉన్నాయి. స్వల్ప దూరంలో ఈ రెండింటితో పాటు మరో ఐదు జలపాతాలుండటం ఆదిలాబాద్ ప్రత్యేకత. జాతీయ రహదారి ఉండటంతో రవాణాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పర్యాటకులను ఆకర్షించడంలో ఇది కలిసొచ్చే అంశం. పైగా ఆదివాసులు, అడవులతో సందర్శకులకు ఒక కొత్త అనుభూతినిస్తుంది. వర్షాకాలంలో పచ్చదనం పరచుకునే అడవిలో పరుగులు తీసే ప్రవాహంతో జలపాతాల హళయలు తనివితీరా చూసి తీరాల్సిందే. పొచ్చెరలో స్నానపుగదులు, లాండ్ స్కేపింగ్, జలపాతంపై చెక్‌డ్యాంలు నిర్మించారు. ప్రస్తుతం నీటి సరఫరా లేక అధ్వానంగా మారాయి. చిన్నారులు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన ఆటవస్తువులు శిథిలమవుతున్నాయి. మరుగుదొడ్లు శిథిలమయ్యాయి. పర్యాటకులు సేద తీరడానికి, బస చేయడానికి ఎలాంటి వసతులు లేవు. తాగునీటి రక్షిత పథకం పని చేయడం లేదు. వ్యూ పాయింట్లు లేవు.. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మరుగుదొడ్లు, మూత్రశాలలు వినియోగంలో లేక అధ్వానంగా మారాయి. దుస్తులు మార్చుకోడానికి మహిళలకు డ్రెస్సింగ్
గదులు, వర్షం పడితే తడవకుండా ఉండేందుకు షెడ్లు లేవు. జలపాతాలకు సంబంధించిన సమాచారం ఎక్కడా కనిపించదు. తెలుగు సినిమా షూటింగ్‌ల కోసం కేరళ, తమిళనాడు, ఇతర దేశాలకు వెళ్తారు. వాటికి ఏమాత్రం తీసిపోని ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లు చేసుకునేలా అభివృద్దిచేయాల్సి ఉంది. వసతులను ఆధునికీకరించి యాత్రికులు బస చేసేందుకు కాటేజ్‌లు, హరిత ¬టళ్లను ఏర్పాటుచేయాలి. ప్రభుత్వం రైతులకు సాగు నీరందించాలనే ఉద్దేశంతో పొచ్చర జలపాతానికి ఎగువన ఇటీవల కంటేగాం, కరత్‌వాడ ప్రాజెక్టులు నిర్మించడంతో ఈ ప్రవాహాలకు అవి అడ్డుకట్టలా మారాయి. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసినా ప్రాజెక్టుల్లో నీరు నిల్వ ఉండిపోయి దిగువకు ప్రవాహం రాకపోవడంతో జలపాతాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. పర్యాటక శాఖ పరంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని అధికారులు అన్నారు. హరిత¬టల్, యాత్రికులు భోజన వసతి, రిసార్టు, పార్కింగ్, మౌలిక వసతుల కల్పన, గుడారాలను ఏర్పాటు చేయాలని నివేదికను అందజేశారు.