జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి సహాయుకు లకు సత్య సాయి నిత్య అన్నదాన పంపిణీ.
ప్రతిరోజు 150 మందికి అన్నదానం.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్21(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో రోగి సహాయకులకు నిత్యం సత్యసాయి అన్న ప్రసాద పంపిణీని కొనసాగిస్తున్నట్లు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ హకీమ్ విశ్వ ప్రసాద్, శ్రీసాయి ప్రశాంతి చారిటబుల్ సేవా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎలిమ ఈశ్వరయ్యలు తెలిపారు. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 90వ జన్మదినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా 2016, నవంబర్ 23న ప్రారంభమైన నిత్యాన్నదాన కార్యక్రమాన్ని రోగి సహాయకులకు ఉచితంగా ప్రతిరోజు అందిస్తున్నట్లు వారు తెలిపారు. జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాలలోని భక్తులు, ప్రోత్సాహకుల వారి జన్మదిన సందర్భంగా, వివాహ దినోత్స పునస్కరించుకొని,పిల్లల పుట్టినరోజు సందర్భంగా మరియు ఇతర వేడుక,భక్తులు వారు కోరిన రోజు అన్నదానాన్ని వారి పేరిట వారిచే, పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అన్న ప్రసాద పంపిణీ గొప్ప సేవా కార్యక్రమమని, నిత్య అన్నదానానికి సహకరించిన అందరికీ భగవాన్ బాబా వారి కృపా కటాక్షాలు ఉంటాయని అన్నారు. ప్రతిరోజు రోగి సహాయకులకు, గర్భిణీలకు, బాలింతలకు, ప్రతి రోజూ 150మంది వరకు ఉచితంగా అందజేస్తున్నారు. ఈ సేవ కార్యక్రమానికి సత్యసాయి భక్తుల సేవలు, ప్రోత్సాహం ఇతోదికంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.