జిల్లా బాల భవన్ లో పాటలు రంగవల్లుల పోటీలు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): 75 వసంతాల స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్, డిఈఓ ఆదేశాల మేరకు జిల్లా బాల భవన్ లో జిల్లాస్థాయిలో నేడు దేశ భక్తి గీతాలు, పాటల పోటీలు, రేపు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నామని  బాల్ భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి శుక్రవారం తెలిపారు.జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని, మరిన్ని వివరాలకు  బాల్ భవన్ లో సంప్రదించాలని సూచించారు. కోరారు.స్వాతంత్ర దినోత్సవం రోజున పరేడ్ గ్రౌండ్స్ లో  నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలో పాల్గొనదలచిన ఆసక్తి కలిగిన ప్రభుత్వ , ప్రైవేట్  పాఠశాలల విద్యార్థులు బాల్ భవన్ లో తమ పేరు నమోదు చేసుకుని, నృత్య శిక్షణ పొంది ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ  అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.