“జిల్లా మహిళా సంఘం బిసి అధ్యక్షురాలు
మధులత గారికి ఘన సన్మానం”
యాలాల సెప్టెంబర్ 27 ( జనం సాక్షి ): వికారాబాద్ జిల్లా బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైన మధులత
గారిని యాలాల మండల విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో యాలాల మండల బిసి సంఘం అధ్యక్షులు చెన్నారం వడ్ల లక్ష్మణా చారి మాట్లాడుతూ విశ్వకర్మ సోదరికి ఈ అవకాశం లభించడం మాకు ఎంతో గర్వకారణం అని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన జాతీయ బీసీ సంఘం కార్యనిర్వాహక సభ్యులు ( తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ ) కందుకూరి రాజ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అని ఆయన తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో యాలాల్ మండల విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కమ్మరి శేఖర్, ప్రధాన కార్యదర్శి భాస్కరాచారి, విశ్రాంత ఉపాధ్యాయులు బాలయ్య చారి, మరియు నాయకులు శ్రీనివాసచారి, విద్యాసాగర్ చారి, ప్రభాకర్ చారి, వడ్ల శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.