జిల్లా వాసికివెబ్ సిరిస్ లో హీరోగా అవకాశం
-భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండల వాసి శివ రాకీ హీరోగా-భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండల వాసి శివ రాకీ హీరోగా
టేకులపల్లి, అక్టోబర్ 16( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని తడికలపూడి గ్రామపంచాయతీ పరిధిలోగల కోక్య తండా గ్రామంలో జన్మించిన శివ రాఖి వెబ్ సిరీస్ లో హీరోగా అవకాశం రావడం టేకులపల్లి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుల్లితెరలో చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైన తన నటనతో పలువురిని ఆకర్షిస్తూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో ప్రధాన పాత్ర పోషించారు. తన కెరీర్ అక్కడి నుంచి సినీ రంగంలో అవకాశాలు రావడంతో గత సంవత్సరం దాస్ గ్యాంగ్ మూవీ చేశారు. ఆ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లో శివ రాఖీకి హీరోగా, హీరోయిన్ గా అశ్విత తో నివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కొత్త వెబ్ సిరీస్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ధర్మవిజయ్ ,మద్దిమడుగు సాయి,రిక్కీ నాయుడు ముఖ్య అతిథిలు గా హాజరై ప్రారంభించారు. ఈ సిరిస్ కు టెక్నీషియన్స్, కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం నివాస్, కో డైరెక్టర్ గా, రితేష్ గౌడ్, నిర్మాతగా అవినాష్. ఈ సిరిస్ లో ముఖ్య పాత్రలో కిషోర్,విజయ్ తదితరులు నటిస్తున్నారు.ఈ సందర్భంగా జిల్లాలోని వారి అభిమానులు భద్రాద్రి ఎ.టి.ఇ.సి (అలియన్స్ ఆఫ్ టీచర్స్ ఎంప్లాయిస్ క్లబ్) జిల్లా అధ్యక్షులు బాలు నాయక్ శుభాకాంక్షలు తెలిపారు.