జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 20 (జనం సాక్షి);
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. చందు నాయక్ ప్రోగ్రాం ఆఫీసర్లకు, ఆర్ బి ఎస్ కె ప్రోగ్రాం, వైద్యాధికారులకు, సిబ్బందికి, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రిపోర్టింగ్ సూపర్వైజర్లకు , అర్బన్ వైద్య సిబ్బందికి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మాతా శిశు సంరక్షణ సేవలు అందించడంలో,పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించడంలో, అసంక్రమిత వ్యాధులను గుర్తించి చికిత్సలు చేయించడంలో, అనుమానిత క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించి పరీక్షలు చేయించి, క్షయ వ్యాధి ఉన్నవారికి చికిత్సలు అందించడంలో,ఆరోగ్య కార్యకర్తలు,ఆశలు అన్ని కార్యక్రమాలను 100 శాతం లక్ష్యాలను సాధించేటట్లు రిపోర్టింగ్ సూపర్వైజర్లు, మాతా శిశు సంరక్షణ సూపర్వైజర్లు, ఫీల్డ్ లెవెల్ లో పర్యవేక్షణ చేసి కార్యక్రమాలను ఆన్లైన్లో అప్డేట్ చేసేటట్లు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
సూపర్వైజర్లు, వి హెచ్ ఎన్ డి,వి హెచ్ ఎస్ ఎన్ సి మీటింగ్ ని పర్యవేక్షణ చేయాలని,
ప్రతి వారము ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలకు, ఆశ కార్యకర్తలకు అన్ని ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించాలని, ఆర్ బి ఎస్ కె ప్రోగ్రాం లో భాగంగా వైద్యాధికారులు, సిబ్బంది జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడి సెంటర్లు సందర్శించి విద్యార్థులను అందరిని స్క్రీనింగ్ చేసి చికిత్సలు అందించాలని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ . ఎస్.కె సిద్ధప్ప, మాత శిశు సంరక్షణ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎస్. శశికళ, ఎన్ సి డి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్. మారుతి నందన్ గౌడ్, ఆర్.బి.ఎస్.కె వైద్యాధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వైద్య సిబ్బంది కోట్ల మధుసూదన్ రెడ్డి , టి .వరలక్ష్మి, శ్యామ్ సుందర్, రామాంజనేయులు, టి. తిరుమలేష్ రెడ్డి, రవి కుమార్, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రిపోర్టింగ్ సూపర్వైజర్లు , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.