జిల్లెల్ల గ్రామాన్ని సందర్శించిన ఎం.పీ.డీ వో ఆంజనేయులు

నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో జులై 27 జనం సాక్షి: కల్వకుర్తి మండల పరిధిలోని
జిల్లెల్ల గ్రామాన్ని కల్వకుర్తి ఎంపీడీవో ఆంజనేయులు స్థానిక సర్పంచ్ ఎముక జంగయ్య తో కలిసి బుధ వారంరం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని కలియదిరిగి మొక్కలను పరీశిలించారు. అనంతరం అక్కడి నుండి నడుచుకుంటూ అంగానీవాడి సెంటర్ కు చేరుకున్నారు. అంగన్వాడీలోని విద్యార్థులను పలు ప్రశ్నలను అడిగి వారి యొక్క విద్యపై ఆరా తీశారు. విద్యార్థులకు వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. అక్కడి నుండి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చేరుకుని విద్యార్థిని, విద్యార్థులను ఇంగ్లీష్, గణితం కు సంభందించిన పలు ప్రశ్నలను అడిగి తెలుసుకొని, పాఠశాలలోని పచ్చదనం, పరిశుభ్రతను పరిశీలించారు. మురుగు నీటి కాలువలను పరీ శిలించి, చర్చి సమీపంలోని మురుగునీటి కాలువలో ఆయిల్ బాల్స్ ను వదలడాన్ని పరీశీలించారు. వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని దోమలు వ్యాప్తించకుండా, దోమల లార్వాను విచ్చిన్నం చేయడానికి ఎంతగానో దోహదపడతాయని ఎంపీడీవో ఆంజనేయులు అన్నారు. గ్రామంలోని పరిసరాల పరిశుభ్రత – పచ్చదనం పాఠశాలల పనితీరు ను ఎంపీడీవో సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడి సెంటర్ లో కిచెన్ రూం, టాయిలెట్స్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎంపిడిఓ దృష్టికి సర్పంచ్ ఎముక జంగయ్య తీసుకెళ్లారు. త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, పక్కనే ఉన్న ఏపీఓకు త్వరలో బాత్రూం, కిచెన్ సెడ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ సూచించారు. కార్యక్రమంలో ఎంపిఓ దేవేందర్, ఏ.పి
ఓ చంద్ర సిద్ధార్థ, సెక్రెటరీ ఇందిరా, మాజీ ఉప సర్పంచ్ పి. పాండు గౌడ్ , ప్రధానోపాధ్యాయులు శంకర్, ఉపాధ్యాయులు రామకృష్ణ, సురేఖ ,లక్షణమ్మ , అయా సంతోష, జంగయ్య, ఇదమయ్యా తదితరులు పాల్గొన్నారు.