జీఎస్టీ పెంపుధలను తక్షణమే ఉపసంహరించుకోవాలి — సీపీఎం

మోత్కూరు జూలై 22 జనంసాక్షి : జీఎస్టీ పెంపులో బాగంగా సంచుల్లో ప్యాక్ చేసిన బియ్యం, గోధుమలు, పాలప్యాకెట్లు, వంటి నిత్యావసరాల పై తాజాగా జీఎస్టీ విధించటం ద్వారా ప్రజలపై మోయలేని బారాన్ని వేసిన కేంద్ర ప్రభుత్వం, వెంటనే ఉపసంహరించు కోవాలని, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు గ్రామాలలో నిరసన కార్యక్రమాలలో బాగంగా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గత 75 ఏళ్లలో బియ్యం,గోధుమలు, పప్పు ధాన్యాలు, వంటి ఆహార పదార్థాలపై, రోజువారీ అవసరాలైన పాలు, పెరుగు, మాంసం, చేపలు, బెల్లం, వంటి వాటిపై ఎన్నడూ పన్నులు విధించలేదు. కానీ ఇప్పుడు ”ఆజాద్ కా అమృత్ మహోత్సవ్” సంవత్సరంలో భారత ప్రజలకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన కానుక గా ఉందని, జీఎస్టీ పెంచిన వాటిలో శవదహన చార్జీలు, ఆసుపత్రి పడకలు, రాసుకునే ఇన్కు, మనం పొదుపు చేసుకున్న డబ్బులపై, కూడ 18/ శాతం విధించిందని, అత్యంత సంపన్నుల పై పన్నులు విధించటానికి బదులు, మోడీ ప్రభుత్వం వారికి మరింతగా రాయితీలు ఇస్తూ, రుణాలను రద్దు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, కొంపల్లి ముత్తమ్మా, పిట్టల చంద్రయ్య, సహాయ కార్యదర్శి చింతకింది సోమరాజు,వడ్డేపల్లి లక్ష్మణ్, కొంపల్లి గంగయ్య, వెండి యాదగిరి, దడిపల్లి సైదులు, కోసన మమత, దడిపల్లి నవనీత, కొంపల్లి రమ తదితరులు పాల్గొన్నారు.
Attachments area