జీఎస్టీ పేరుతో దోచుకుంటున్న మోడీ ప్రభుత్వం.
-అవినీతి కంపులో కేసీఆర్ ప్రభుత్వం
-రాజకీయ డ్రామాలకు తెరలేపిన బిజెపి ,టీఆర్ఎస్
-దోపిడి పార్టీలకు వ్యతిరేకంగా వామపక్ష సామాజిక ఐక్యతకు సిపిఎం,సిపిఐ కలసి రావాలి
-ప్రజా పోరాటాలే కేంద్రంగా ఎంసిపిఐ(యు) నిర్మాణాత్మక కృషి
-ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
వరంగల్ ఈస్ట్, జూలై 27( జనంసాక్షి)
దేశంలోని మోడీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో గడ్డం గీసుకునే బ్లేడు తో సహా పాఠ్యపుస్తకాలు పిల్లలకు వాడే పాలు, దినుసులపై శవపేటికలపై పన్నులు విధించి కార్పొరేట్ సంపన్నుల సేవలో తరిస్తున్నదని ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తూ డాలర్ కు రూపాయలు 80 లకు దిగజారిన, ప్రజలు పెరిగిన ధరలతో అవస్థలు పడుతున్న కనీస పట్టింపు లేకపోవడం దారుణమని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి అన్నారు.
బుధవారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) రాష్ట్ర కమిటీ సమావేశం కామ్రేడ్ గోనె కుమారస్వామి అధ్యక్షతన వరంగల్ లోని ని ని ని ని ఓంకార్ భవన్ కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో కామ్రేడ్ గాదగోని రవి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సమస్యల విస్మరించి ఓట్లు సీట్లు రాజకీయాలే ధ్యేయంగా ప్రజలను పక్కదోవ పట్టిస్తూ అయోమయానికి గురి చేస్తూ పాలన సాగిస్తున్నాయని ఈ క్రమంలో ప్రజలపై విపరీతమైన భారాలు మోపి దేశ సంపదను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ అవినీతి అక్రమాలతో అధికార పబ్బం గడుపుతున్నారని చట్టసభలను ఈడిని ఉపయోగించుకొని తమ అవినీతిని కప్పిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారని ప్రశ్నించే గొంతుకులను నిర్బంధం ప్రయోగించి అణచివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి మరిన్ని అప్పులు చేసి దేశాన్ని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు కుల మత ప్రాంత విభేదాలతో ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించి లబ్ధి పొందేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో బూర్జువా భూస్వామ్య దోపిడీ పార్టీలకు వ్యతిరేకంగా నికరంగా నిలబడాల్సిన సిపిఐ సిపిఎం పార్టీలు అది విస్మరించడం సరైనది కాదన్నారు. ఇప్పటికైనా బూర్జువా భూస్వామ్య దోపిడీ పార్టీలకు వ్యతిరేకంగా వామపక్ష సామాజిక ఐక్యత కేంద్రంగా కలిసి రావాలని కోరారు.
రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల నిరసిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ నిర్మాణాత్మక పోరాటాలకు తమ శక్తి మేరకు కృషి చేయాలని రాష్ట్ర కమిటీ లో నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కుంభం సుకన్య పెద్దారపు రమేష్ వరికుప్పల వెంకన్న వస్కుల మట్టయ్య ఎన్ రెడ్డి హంసారెడ్డి తుకారాం నాయక్ నజీర్ రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం నాగార్జున కర్ర రాజిరెడ్డి తాండ్ర కళావతి వంగల రాగసుధ సింగతి సాంబయ్య నర్ర ప్రతాప్ బాబురావు మాస్ సావిత్రి రవి వెంకటయ్య సైదక్కా పుష్ప వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
|