జీవిత కాలంలో వాజ్‌పేయీకి భారతరత్న

numkz7cpన్యూఢిల్లీ : భారతరత్న దేశ అత్యున్నత పౌర పురస్కారం. ప్రజా సేవ, శాస్త్ర సాంకేతిక, ప్రభుత్వ సేవలు, కళలు మొదలైన అంశాలలో భారతరత్నను అందజేస్తారు. అయితే ఇప్పటి వరకు భారతరత్నను ఆరుగురు ప్రధానులకు ప్రకటించారు. కానీ రాజకీయ కురవృద్ధుడు, బీజేపీ అగ్రనేత అటల్ బీహారి వాజ్‌పేయీ బతికుండగానే భారత రత్న అందుకుంటున్నారు. జీవిత కాలంలో భారతరత్న అందుకుంటున్న తొలి మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఒక్కరే. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటలకు భారతరత్నను వాజ్‌పేయీకి రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీ అందజేయనున్నారు. ఈ కార్యక్రమం వాజ్‌పేయీ నివాసంలో జరగనుంది. కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులతో పాటు ఇతరులు హాజరు కానున్నారు. 1998 -2004 వరకు భారత ప్రధానిగా వాజ్‌పేయీ పని చేశారు.

భారతరత్న అందుకున్న ప్రధానులు
1955లో నెహ్రూ, 1966లో లాల్‌బహదూర్ శాస్త్రి, 1971లో ఇందిరాగాంధీ, 1991లో రాజీవ్‌గాంధీ, మొరార్జీ దేశాయ్, 1992లో గుల్జారీలాల్ నందకు భారతరత్న ప్రకటించబడ్డాయి.
వాజ్‌పేయీ ప్రపంచానికి మార్గదర్శకుడురాజ్‌నాథ్‌సింగ్‌
మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయీ ప్రపంచానికి మార్గదర్శకుడని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కొనియాడారు. శుక్రవారం వాజ్‌పేయీకి భారతరత్న ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. వాజ్‌పేయీ భారతరత్న అందుకోవడం గర్వంగా ఉందన్నారు. కేవలం దేశ నాయకుడిగానే గాక, తన దార్శనికతతో ప్రపంచ దేశాల్లోనూ చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా వాజ్‌పేయీకి భారతరత్న ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గొప్ప రాజనీతివేత్త అయిన వాజ్‌పేయీకి భారతరత్న రావడం సంతోషంగా ఉందని ట్విట్టర్లో పేర్కొన్నారు.