జీహెచ్ఎంసీ ఎన్నికలపై వీడిన ఉత్కంఠ…

ukq94bz1హైదరాబాద్ : గత కొంతకాలంగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై రేగుతున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. జనవరి 31లోగా ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని గతంలో లాగా మాట తప్పవద్దని కోర్టు సూచించింది. ఎన్నికల నిర్వాహణకు ఎందుకు సమయం తీసుకుంటున్నారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆధార్ అనుసంధానం..వార్డుల సరిహద్దు..ఇతరత్రా కారణాల వల్ల ఎన్నికల నిర్వాహణ ఆలస్యం అవుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో డిసెంబర్ 15వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ ఎన్నికలు నిర్వహించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎన్నికల్లో గెలవాలని పలు పథకాలు ప్రవేశ పెడుతోందని, నగర వాసులపై వరాలు కురిపిస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.