జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తాం
-ఎన్నికల షెడ్యూల్‌తో కోర్టుకు వస్తాం
-హైకోర్టుకు ప్రభుత్వ వివరణ
హైదరాబాద్,ఫిబ్రవరి16(జనంసాక్షి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుఈత్వం సిద్దంగా ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వివరించింది. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రత్యేక అధికారుల పాలన సరికాదని కోర్టు పేర్కొంది. అయితే జీహెచ్‌ఎంసీలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వచ్చే విచారణకు ఎన్నికల షెడ్యూల్‌తో కోర్టుకు వస్తామని న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కు ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై పిటిషన్లకు సంబంధించి విచారణ సోమవారం హైకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. హైదరాబాద్‌కు ప్రత్యేక అధికారి పాలన మంచిది కాదని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఎప్పుడు నిర్వహించేదీ తేదీలతో పూర్తిస్థాయి అఫిడవిట్‌ను వచ్చే వారం కోర్టుకు సమర్పిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో విచారణను ధర్మాసనం వచ్చే వారానికి వాయిదా వేసింది.