జూబ్లీహిల్స్‌ నిజాం హైస్కూల్‌లో ఓటు వేసిన కేటీఆర్‌

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ నిజాం హైస్కూల్‌లో రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కే. తారకరామారావు శుక్రవారం మధ్యాహ్నం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా… కేటీఆర్ సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తన సోదరి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలైన కల్వకుంట కవిత బోధన్ నియోజకవర్గంలోని పోతంగల్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.