జూలై 26వ తేదీన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే పార్లమెంటు ముట్టడి ని జయప్రదం చేయండి
బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధనుంజయ నాయుడు
గరిడేపల్లి, జూలై 22 (జనం సాక్షి): జులై 26, 27,28 తేదీలలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగబోతున్న పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనుంజయ నాయుడు విజ్ఞప్తి చేశారు.శుక్రవారం ఆయన గరిడేపల్లిలో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకులతో కలసి పాత్రికేయులతో మాట్లాడుతూ
అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు యాభై శాతం రిజర్వ్ పెట్టాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనగణలలో కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ 26 ,27,28 తేదీలలో చలో ఢిల్లీ ఉద్యమ కార్యక్రమాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో చేపట్టినట్టు బీసీ నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో 75 మంత్రిత్వ శాఖలు ఉన్నాయని అదనంగా మరొక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అదే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అని పలుమార్లు కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడం శోచనీయమని 75 సంవత్సరాల స్వతంత్ర భారతావని లో ఎన్ని ప్రభుత్వాలు మారినా పాలకుల్లో మార్పు రావడంలేదని అందువల్ల బీసీలే చైతన్యవంతులై మన ఓట్లు మనమే వేసుకుని రాజ్యాధికారం సాధించిన నాడే బీసీల హక్కుల కల సాకారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆయన వెంట బీసీ సంక్షేమ నియోజకవర్గ అధ్యక్షుడు ధూళిపాళ శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి జనిగెల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు రాంబాబు గౌడ్, వల్లపు దాసు జోష్, కందుల వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.