జెండా ఊంఛా రహే హమారా

3

సంజీవయ్య పార్కులో భారీ త్రివర్ణ పతాకం

హైదరాబాద్‌,జూన్‌ 2(జనంసాక్షి): దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండా హైదరాబాద్‌లో ఆవిష్కృత మయ్యింది. సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన భారీ త్రివరణ పతాకాన్ని సిఎం కెసిఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం/- దానికి వందనం చేశారు. దీంతో  తెలంగాణలో రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్నంటాయి. నగరంలోని సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. 303 అడుగుల ఎత్తయిన జెండాస్తంభంపై 108 అడుగుల వెడల్పు, 72 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని సీఎం చేతుల విూదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సభాపతి మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీఎస్‌ రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్నంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మారావు, సీఎస్‌ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, పలవురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.