జెడిఎస్‌తో కలసి పనిచేసే అవకాశం

ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సి ఉంది: బాబు
బెంగళూరు,మే23( జ‌నం సాక్షి): జాతి ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్‌లో జెడిఎస్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కర్టాటక ముఖ్యమంత్రిగా జెడిఎస్‌ నేత హెచ్‌డి కుమారస్వామి బుధవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బెంగళూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడారు. అంతకుముందు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో భేటీ అయ్యారు. కుమారస్వామికి శుభాకాంక్షలు తెలిపి.. తమ సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్‌లో జేడీఎస్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు విూడియాతో మాట్లాడుతున్న సమయంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అక్కడే ఉండటం విశేషం. అంతేకాదు, అంతకుముందు మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీ అయినట్లు కూడా తెలిసింది. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు చర్చకొచ్చినట్లు సమాచారం. ఏపీకి జరిగిన అన్యాయాన్ని మమతకు చంద్రబాబు వివరించారు. బీఎస్పీ నేత మాయావతితో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. ఇదిలావుంటే ఉదయం అమరావతిలో రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఉదయం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా నీటిమట్టాలపై పరిశీలన చేశారు. ప్రధాన జలాశయాల్లో 207.31 టీఎంసీల నీటి నిల్వ ఉందని, మధ్య తరహా జలాశయాల్లో 107 టీఎంసీలకుగాను 27.9 టీఎంసీల నీటినిల్వ ఉందని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు తెలియజేశారు. రాబోయే ఖరీఫ్‌ సీజన్‌కు నారుమళ్లకు వీలుగా నీటి విడుదలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సూచించారు. జలసంరక్షణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.