జె. నారాయణ కుటుంబానికి ముంబైకర్ల పరామర్శ

ముప్కాల్ జనం సాక్షి (అక్టోబర్ 20)
జిల్లాలో తొలి తరం. అంబేడ్కరైట్ ఉద్యమ నాయకుడు, అంబేడ్కర్ యువజన సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జె. నారాయణ (64) బుధవారం అనారోగ్యంతో ముప్కాల్ మండల కేంద్రంలోని నల్లూర్ గ్రామంలో మృతి చెందారు. ఆయన రాష్ట్ర దళిత సంఘాలతో కల్సి, జిల్లా రాష్ట్ర సమస్యలపై ఉద్యమించిన యోధుడు. ఆయన మరణ వార్త విన్న వెంటనే ముంబై నుంచి గురువారం అంబేడ్కరైట్ నాయకులు నల్లూర్ వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు తమ ముంబై వలసజీవులకు అవినవభావ సంబంధాలు ఉన్నాయని. జిల్లాకు చెందిన ముంబైకర్ల వ్యక్తిగత, కుటుంబం, సామాజిక సమస్యల నివారణకు కృషి చేసిన ఆత్మీయుడని, ఆయన మరణం తమ అంబేడ్కరైట్ ఉద్యమానికి తీరని లోటు అంటూ ముంబై బృందంలోని ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం మాజీ జాతీయ ఉపాధ్యక్షులు మూల్ నివాసి మాలజీ, బొల్లే శివరాజ్, దేవా పద్మారావు పేర్కొన్నారు. వీరికి తోడుగా మాదిగ కులాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కర భూమన్న, ఏఐఏయుఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షెట్పల్లి నారాయణ, జైభీం శక్తి నేత దోన్కంటి లింగం తదితర్లు వారి కుటుంబానికి సర్వశక్తుల ధైర్యం ఇస్తూ, ఆత్మీయంగా పరామర్శించారు.