జేఎన్‌టియులో మౌలిక సదుపాయాలు కల్పించాలి

కరీంనగర్‌, జూలై 25 : సెంటనరీ కాలనీ వద్ద గల జేఎన్‌టీయు కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ విద్యార్థినీ విద్యార్థులు బుధవారం కళాశాల ఎదుట ధర్నా చేపట్టారు. కళాశాలలో మంచినీటి సమస్య అధికంగా ఉందని, విద్యార్థినులకు టాయిలెట్లు, బాత్‌రూంలు సరిగా లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తగినంత మంది బోధనా లెక్చరర్లు లేకపోవడంతో వెనకబడి పోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. ధర్నా కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

తాజావార్తలు