‘ జై తెలంగాణ అంటేనే నమ్ముతరు ‘: పోచారం
నల్లగొండ: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, వైఎస్ జగన్ చెల్లె షర్మిల ‘జైతెలంగాణ’ అంటేనే తెలంగాణ ప్రజలు నమ్ముతారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన సూర్యాపేట సమరభేరి సభాప్రాంగణం వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో తిరిగితే, ప్రచారం చేస్తే తెలంగాణను అడ్డుకున్నదే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని విమర్శించారు. సీమాంధ్ర నేతలను ప్రోత్సహించి తెలంగాణను అడ్డుకున్నది బాబేనని దుయ్యబట్టారు. బాబు అడ్డుకోకుంటే తెలంగాణ ఏర్పడేదని, తొమ్మిది వందల మంది తెలంగాణ ప్రాంత విద్యార్థుల బలిదానాలు ఆగేవని పోచారం ఆవేదినతో అన్నారు. ఈబలిదానాలకు కారణం టీడీపీ, వైఎస్సార్ సీపీలేనని ఆయన ఆరోపించారు.