జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారం
అయిజ,జులై 07 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలో తెలంగాణ రాష్ట్ర మాజీ బిసి కమిషన్ సభ్యులు డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఆదేశానుసారం జై నడిగడ్డ యువత ఆధ్వర్యంలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారం.అందులో భాగంగా అయిజ మండల కమిటీ ఆధ్వర్యంలో పులికల్ గ్రామంలో మొదటి 05 ర్యాంకు సాధించిన , జాయిస్ మేరి 9.5 , రాకేష్ 9.2 ,హబీబ 9.2 , పావని 9.2 , అజీమ 9.0 విద్యార్థులను సన్మానించడం జరిగింది.
అదే విధంగా జడ్.పి.హెచ్.ఎస్ భూంపురం లో మొదటి 5ర్యాంకులు సాధించిన బి. ఉషా 8.7 , శిరీష 8.5 ,బి రవి 8.5 , అశ్విని 8.5 , రామాంజనేయులు 8.0 ,విద్యార్థులను సన్మానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జై నడిగడ్డ యువత జిల్లా సమన్వయకర్తలు కురువ వీరేష్ , బోయ సత్యం మాట్లాడుతూ.జై నడిగడ్డ యువత ఎజెండాలో ప్రదాన అంశం విద్యాభివృద్ధి అందులో భాగంగానే ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు జై నడిగడ్డ యువత చేపడుతుందని.ఎంతో మంది హైదరాబాద్ చదువుతున్న పేద విద్యార్థులకు డాక్టర్ ఆంజనేయ గౌడ్, సహాయం చేయడం జరుగుతుందని.ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఏమి కావాలో పాఠశాలలో దశలోనే నిర్ణయించుకోవాలి. అత్యున్నతమైన సర్వీస్ లను తమ గమ్యాలుగా నిర్ణయించుకొని దానికనుగుణంగా అభ్యసనం కొనసాగించాలని.
నడగడ్డ ప్రాంతంలో పేద విద్యార్థులకు డాక్టర్ ఆంజనేయ గౌడ్ మరియు జై నడిగడ్డ యువత అండగా ఉంటుందని చెప్పడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి సహకరించిన పులికల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు హబీబా , భూంపురం జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్న తిమ్మప్ప కి జై నడిగడ్డ యువత తరుపున ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్లు భూంపురం అంజి ,పులికల్ నల్లన్న, జై నడిగడ్డ యువత మండల సమన్వయకర్తలు వీరన్న, రామాంజనేయులు, శివన్న, రామలింగడు, ప్రదీప్ ,నరేష్, గోనారం హనుమంతు, నర్సింహులు, రంగస్వామి, రామప్ప ,వీరన్న ,మరియు ఉపాధ్యాయుల బృందం, తదితరులు పాల్గొన్నారు