జోగులాంబ గద్వాల జిల్లాలోని కలుషిత నీరు తాగి ముగ్గురు మృతి
గద్వాల ప్రతినిధి, జనం సాక్షి (జూలై 7);
గద్వాల పట్టణంలోని కలుషితమైన నీరును తాగడం వలన అస్వస్థకు గురై గద్వాల ప్రభుత్వ ఆసుపత్రులలో చేరగా ఇద్దరి పరిస్థితి విషమం కావడంతో కర్నూలుకు చికిత్స నిమిత్తం కోసం బయలుదేరుతుండగా ఇద్దరు గంటగేరికి చెందిన శ్రీకాళ కృష్ణ, నర్సింగమ్మ మార్గమధ్యంలో మృతి చెందడం జరిగింది. గురువారము బేబీ అనే 34 మహిళ మృతి చెందడం జరిగింది.కలుషితమైన నిటి సరఫరాతో అధిక సంఖ్యలో జనం ఆస్పత్రి లో పరుగుల తో పరిగెడుతున్నారు. వేదనగర్ గంటగిరి ధరూర్ మెట్టు పలు ప్రాంతాలలో కలుషితమైన నీటిని తాగి 50 మంది బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు .వాంతులు విరేచనాలతో బాధితులు ఇబ్బందులుపడుతున్నా పట్టించుకోని మున్సిపల్
అధికారులు,మున్సిపల్ లైన్మెన్ల ను పిలిచి చెప్పినా కూడా నిర్లక్ష్యం వహించారని కాలనీవాసులు అంటున్నారు.జలమండలి సరఫరా చేస్తున్న తాగు నీరు కలుషితమై ఉన్నట్లు చెబుతున్న 15 రోజులుగా నీరు వాసన రంగులతో వస్తుంది అని ఫిర్యాదు చేస్తున్న ఎవరు గుర్తించుకోలేదనీ, ఇంటికొకరు వాంతులు విరోచనాలతో బాధపడుతూనట్లు ప్రజలు ఆవేదనను వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న డీఎం హెచ్ ఓ. సిబ్బంది ఆశ వర్కర్లు ఆ యొక్క వార్డులలో తిరుగుతూ నీటిని తాగడం, ఆ నీరుతో స్నానం కూడా చేయరాదని హెచ్చరించారు. ప్రతి ఇంట్లో విరోచనాలతో వాంతులలో ప్రజలు సతమవుతున్నారని వైద్యాధికారి డాక్టర్ మాధుర్య తెలిపారు.విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బిఎస్ కేశవ్ ,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, ఇసాక్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందజేయాలని సూచించారు.