జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించిన..

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్, జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి
  గద్వాల ప్రతినిధి సెప్టెంబరు 23 (జనంసాక్షి):-   గత వారం రోజుల నుంచి ధరణి సమస్యలనుంచి రైతులకు విముక్తి కలగాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండలాల ఎమ్మార్వోలకు వినతిపత్రం ఇచ్చిన స్పందించకుండా రైతులపై నిర్లక్ష్య ధోరాణి తో ఏ లాంటి పరిష్కారం చూపకపోవడంతో శుక్రవారం చలో కలెక్టరేట్ ముట్టడి ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ముట్టడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి సమయంలో పోలీసుల అతి ఉత్సాహం వల్ల అన్యాయంగా తోపులాటలు జరిగాయి ఈ తోపులాటలో జిల్లా అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి  కింద పడడం వల్ల చెయ్యి ఐదు కుట్లు పడినాయి ఒక చూపుడు వేలు విరగడం జరిగినది అప్పటికి అప్పుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి గారికి గద్వాల్ గవర్నమెంట్ హాస్పిటల్ తరలించి ప్రాథమిక చికిత్స చేసి మహబూబ్ నగర్ కి పంపించడం జరిగినది..సంపత్ మాట్లాడుతూ ధరణి వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి ప్రజలకు ఆ సమస్యకు తీర్చాలని న్యాయంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టినాం ఇది ప్రజలకి మేలు చేసే కార్యక్రమానికి అన్యాయంగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తురు. ప్రజాస్వామ్యంలో ధర్నాలో నిరసనలు తెలపడం ప్రజల హక్కు దాన్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం హరిస్తుంది. తాసిల్దార్ కార్యాలయంలో గానీ ఆర్డీవో కాదగ్గర గాని కలెక్టర్ ఆఫీస్ దగ్గర గాని 70 శాతం సమస్యలు ధరణి పోర్టల్ వల్లనే వచ్చాయి ఇంత పెద్ద సమస్యలు జరుగుతుంటే టిఆర్ఎస్ ప్రభుత్వం కొంచెం కూడా పట్టించుకోవడం లేదు అందువల్లనే మేము కలెక్టర్ ముట్టడి కార్యక్రమం పెట్టినాం ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక మెట్టు కింద దిగి ఈ ధరణి సమస్యలను పరిష్కారం చూపాలని కోరుచున్నాము.అరెస్టు చేసి గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారిని మరియు కాంగ్రెస్ నాయకులు తరలించారు..గద్వాల్ లో ముందస్తు అరెస్టులు అయిన వ్యక్తులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, సీనియర్ కౌన్సిలర్ శంకర్ అన్న గారు, గద్వాల్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు సీనియర్ కౌన్సిలర్ ఇసాక్ అన్నగారు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.అరెస్ట్అయినావారిలో జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగ శివమణి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఉమాదేవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శశి రెడ్డి,మనోపాడ్ ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరు బాబు, వడ్డేపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత గారు, ఐజ కౌన్సిలర్ శిక్షావల్లి ఆచారి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు నాగరాజు, గద్వాల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నల్లరెడ్డి మరియు గౌస్ గారు,డిసిసి డెలిగేట్స్  బాచి అన్న మరియు కిఫాయత్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు మరియు సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమల్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అడిషనల్ ఇంచార్జ్ సోలోచనమ్మ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రవి మరియు దినేష్ నాయకులు, ఇలియాస్ లాల్ గౌడ్ ఫెరోజ్, మా భాష వీరేష్, బిసన్న రాము రాజు,శ్రీకాంత్, రియాజ్ అజ్మత్ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు