*జోగులాంబ రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తా*
*నాగర్ కర్నూల్ పార్లమెంటరీ సభ్యులు రాములు*
*అలంపూర్ ఆగస్టు 12 జనం సాక్షి*
జోగులాంబ రైల్వే స్టేషన్ అభివృద్ధికి తన వంతు సహాయ,సహకారాలు అందిస్తానని, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు రాములు అన్నారు. శుక్రవారం అలంపూర్ నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగా జోగులాంబ రైల్వే స్టేషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా
ఫ్లాట్ ఫామ్ హైట్ పెంచాలని,
నీటి వసతి కల్పించాలని,
ప్రయాణికులకు బాత్రూం వసతి కల్పించాలని,
ప్రయాణికులకు వెయిటింగ్ హాల్లో లైట్లు,ఫ్యాన్లు కల్పించాలని,
ప్రయాణికులు రైలు దిగిన తర్వాత వాహనాలు ఎక్కడానికి సబ్ రోడ్డు కల్పించాలని,
వృద్ధులకు వీల్ చైర్స్ కల్పించాలని,
తెలంగాణ బోర్డర్ చివరి రైల్వే స్టేషన్ కాబట్టి ఇక్కడ అన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగేలా చేయాలని, ఎంపీపీ భర్త నాతనేలు, ఉండవెల్లి జడ్పిటిసి తనయుడు తేజ,టిఆర్ఎస్ యువ నాయకులు కిషోర్ లు ఎంపీ రాములు దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించేందుకు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి నా వంతు బాధ్యతతో చేస్తామని అన్నారు.
