జోగుళాంబ దేవి శరన్నవరాత్రిషబ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం

-ఆలయ ఇఓ పురేందర్ కుమార్
-దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలపై సమావేశమైన పాలకమండలిఅలంపూర్ సెప్టెంబర్ 9 (జనంసాక్షి )
జోగులాంబ దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేద్దామని ఆలయ ఈవో పురేంధర్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలపై రెండు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. బ్రహ్మోత్సవాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలు భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లు వంటి అంశాలపై చర్చ జరిగింది ఆలయంలో విద్యుత్ అలంకరణలు ఆలయం ముఖద్వారానికి పూలాలంకరణలు అదేవిధంగా భక్తులకు సామూహిక కుంకుమ అర్చనలు నవరాత్రులపై. విస్తృత ప్రచారాలు. తిప్పోత్సవం. వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. గత ఏడాది కంటే వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగాలని చైర్మన్ సూచించారు నవబ్రహ్మ ఆలయాలు సైతం చివరి రోజు ఆలయ ముఖద్వారాలను పూలతో అలంకరించాలని ఆదేశించారు . తొమ్మిది రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు ఉచిత ప్రసాదాలు కూడా ప్రతిపాదనలు చేశారు,

జోగులాంబ అమ్మవారి పాత ఆలయానికి వైభవాన్ని తీసుకొచ్చేందుకు అక్కడ కూడా ప్రతిరోజు చండీ హోమాలు నిర్వహించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది అయితే పాత ఆలయంలో జరిగేటువంటి చండీహోమాల పాల్గొనేందుకు దంపతులకు అనుమతి తెలిపింది 3116 టికెట్ ధర నిర్ణయించి పూజా సామాగ్రి దేవస్థానమే అందజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు