ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం స్పూర్తిధాయకం.Gjc ప్రిన్సిపాల్ జానయ్య.

భరతమాత ముద్దుబిడ్డ ఝాన్సీ లక్ష్మీబాయి
తొర్రురు 20,జనంసాక్షి ;191 జయంతి ఏబీవీపీ తొర్రూర్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక ప్రభుత్వ అ జూనియర్ కళాశాల లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లో కళాశాల ప్రిన్సిపాల్ జానయ్య, జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ మీ శ్రీనివాస్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జానయ్య మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితమైన ఆ రోజుల్లోనే ఒక మహిళగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే దేశం కోసం వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను తృణప్రాయం సమర్పించిన గొప్ప దేశ భక్తురాలు ఝాన్సీ లక్ష్మీబాయి అనే కొనియాడారు. ఆమె జీవితం నేటి తరం విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రధమ స్వతంత్ర సంగ్రామం 18 57 లో ముందుండి నడిపించిన ఝాన్సీరాణి స్ఫూర్తితో భగత్ సింగ్ లాంటి ఎందరో దేశభక్తులు దేశం కోసం తమ ప్రాణాలు సమర్పించాలని తెలిపారు. ఆమె స్ఫూర్తితో నేడు సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు అఘాయిత్యాలులపై, పోరాడాలని పిక్చర్ పోరాడాలని పిలుపునిచ్చారు వ్యాసరచన పోటీలు ప్రధమ బహుమతి  , ద్వితీయ బహుమతి అందించారు.  ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కే శ్రావణ్, రాపాక రాజు, ప్రశాంత్ గణేష్ ప్రవళిక శ్యామ్ సాయి ప్రకాష్ సాగర్ మహబూబ్ బాషా నితిన్ రమ్య శిరీష తదితరులు పాల్గొన్నారు