*టపాసులు అమ్మే దుకాణాల యజమానులు భధ్రతా ప్రమాణాలు పాటించాలి*.
*ప్రమాణాలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవు* ఎస్ఐ నవీన్ కుమార్.
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ అనుమతి పొంది క్రాకర్స్ స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేనట్లయితే చర్యలు తప్పవు అని నేరేడుచర్ల యస్ ఐ.ఎం నవీన్ కుమార్ అన్నారు.
ప్రతీ దుకాణం ముందు ఇసుక బకెట్ లు,వాటర్ డ్రమ్ములు, ఫైర్ సేఫ్టీ సిలిండర్ పెట్టుకోవాలని దుకాణాలకు దుకాణాలకు మధ్య దూరం పాటించాలని,అగ్ని ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణ ప్రజలు తమ ఇంటివద్ద తగిన జాగ్రత్తలు పాటిస్తూ టపాసులు కాల్చుకోవాల న్నారు.పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు ప్రజావేక్షించాలన్నారు. ప్రతి ఒక్కరూ వెలుగుల పండుగ దీపావళి ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని,మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Attachments area