టపాసుల వ్యాపారుల గుండె గుభేల్
తెచ్చిన సరుకు ఏం చేయాలన్న ఆందోళన
కరీంనగర్,నవంబర్13(జనంసాక్షి): దీపావళి టపాసుల కాల్చివేతపై నిషేధాన్ని అమలు చేయాలన్న హైకోర్టు
ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో టపాసుల విక్రయదారుల ఆశలు నీరుగారాయి. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి నాలుగు రాళ్లు సంపాదిందామనుకున్న వారికి నిరాశ ఎదురయ్యింది. దీంతో తెచ్చిన సరుకును ఎప్పుడు ఎలా అమ్ముకోవాలన్న దానిపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికేఒక్కో జిల్లాలో కోటి నుంచి కోటిన్నర వరకు వ్యాపారం సాగుతుండడంతో అ మేరకు 60 లక్షలకు పైగానే అడ్వాన్సులు చెల్లించి అందోళన చెందుతున్నారు. విక్రయాల కోసం లైసెన్స్‌లకు దరఖాస్తులు చేసుకున్నారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ సారి కూడా రెండు రోజుల ముందు లైసెన్స్‌లు జారీ అవుతాయని భావించి వివిధ ప్రాంతాల్లోని ¬ల్‌సేల్ విక్రయదారులకు లక్షల్లోనే అడ్వాన్స్‌లు చెల్లించారు. జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా రిటైల్ విక్రయ దారులు ఏర్పాట్లు చేసుకున్నారు. గతంలో రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలని నిబంధనలు ఉండగా ఈసారి హరిత ట్రి బ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా గ్రీన్ టపాసులు మాత్రమే కాల్చాలని ముందుగా ఆదేశాలు వచ్చాయి. చివరకు టపాసులు పూర్తిగా కాల్చడమే నిషేధమని చెపుతుండడంతో వ్యాపారుల్లో గందర గోళం ఏర్పడింది.