టిఆర్ఎస్ మహిళ విభాగం గ్రామ కమిటీ ఎన్నిక

మండలంలోని మల్లారం లో టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం గ్రామ కమిటీని పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆదేశాల మేరకు మండల టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పంతకాని చంద్రకళ సంపత్ ల ఆధ్వర్యంలో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షురాలిగా పర్శవేని లక్ష్మీ, ఉపాధ్యక్షురాలిగా చాట్లపెల్లి వనిత, కస్తూరి నిర్మల, ప్రదాన కార్యదర్శిగా మంథెన రమ్య, కోశాధికారిగా మంథెన సమ్మక్క, సంయుక్త కార్యదర్శి గా బొడ్డు సునీత, ప్రఛార కార్యదర్శి గా కట్టెకోల బుచ్చక్క కార్యవర్గ సభ్యులుగా అవిర్నేని కల్పన, మంథిని సుజాత, సరిత, రజీత, రేణుక, తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గోనె శ్రీనివాస్ రావు, సర్పంచ్ గోనె పద్మ, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.