టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలకు కవిత శుభాకాంక్షలు
నిజామాబాద్,డిసెంబర్14(జనంసాక్షి ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉందని మరోసారి నిరూపిత మైందన్నారు. ప్రతిపక్షాల కుట్రలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తిప్పికొట్టారని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే గతంలో ఎన్నడూ లేనంతగా స్థానిక సంస్థలు బలోపేతం కావడంతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టిందని కవిత పేర్కొన్నారు. ఈ ఫలితాలతో మరోసారి రుజువైందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కవిత చెప్పారు.