టిడిపి నేతలకు రోజూ చంద్రబాబు పాఠాలు

రేపటి ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు

దూరంపెట్టే నేతలను గుర్తించే పనిలో బాబు

అమరావతి,జూలై6(జ‌నం సాక్షి): టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవహారాలపై మళ్లీ జోరు పెంచారు. ప్రధానంగా వైకాపాను మోరల్‌గా దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. జనసేన పార్టీని, పవన్‌ కళ్యాణ్‌ను, బిజెపిని పదేపదే ఎండగడుతున్నారు. ప్రతిరోజూ పార్టీ నేతలతో ఏదో ఒక విషయంలో మాట్లాడుతూనే ఉన్నారు. మనం చేస్తున్న అభివృద్దిపై విపక్షాలు బురదజల్లే ప్రయత్నంలో ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని నాయకులను హెచ్చరిస్తున్నారు. విూవిూ నియోజకవర్గాల్లో బలంగా ఉండాలని, విపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని హెచ్చరిక చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు తనయుడు లోకేశ్‌ కూడా యువతను ఆకట్టుకునేలా ప్రకటనలు, ప్రసంగాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించాక ఎపిలో ఇక తిరుగులేని నేతగా ఉన్నారు. ఎన్టీఆర్‌ లాగా కాకుండా ముందే తన తనయుడిని రంగంలోకి దింపడంతో ఇప్పుడు చంద్రబాబు తరవాత లోకేశ్‌ అన్న భావన ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాయకులందరూ రెడ్డి కాంగ్రెస్‌తోనే ఉన్నారు. ఇందిరా కాంగ్రెస్‌ ఏర్పాటుచేసుకున్న శ్రీమతి ఇందిరాగాంధీకి ఆనాడు డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి తప్ప మరో చెప్పుకోదగ్గ నాయకుడు దొరకలేదు. నాయకులు లేకపోయినా సామాన్య ప్రజల అండతో నాటి ఎన్నికలలో ఇందిరా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. బడా నాయకులమని అనుకున్నవారంతా ఎన్నికలలో మట్టి కరచి రాజకీయంగా కూడా కనుమరుగయ్యారు. ఇందిరా కాంగ్రెస్‌ పుణ్యమా అని కొత్త తరం నాయకులు తెరపైకి వచ్చారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అప్పుడు ఇందిరా కాంగ్రెస్‌ తరఫునే తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. 1982లో ఎన్‌.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలోకి రావడంతో మళ్లీ కొత్త తరం నాయకులు రాజకీయాలలోకి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు వ్యూహంకూడా అదేగా ఉంది. వృద్దతరం నేతలను, పనికిరాని వారిని గుర్తించి వదిలించుకునే పనిలో ఉన్నట్లు సమాచారం. రాజకీయాలలో ఎల్లవేళలా ఒకే తరహా వ్యూహం పనిచేయదు కనుక అందుకు అనుగుణంగా బాబు పావులుకదుపుతున్నారు. పరిస్థితులను బట్టి వ్యూహాలను మార్చుకుంటూ ఉండాలి. గత తరంతో పోల్చితే ఈ తరం నాయకులకు రాజకీయ నేపథ్యం తక్కువ! డబ్బు కారణంగానో, కుల బలం

కారణంగానో రాజకీయాలలోకి వస్తున్నారు. ఫలితంగా క్షేత్ర స్థాయిలో ప్రజల నాడిని పసిగట్టడంలో విఫలం అవుతుంటారు. చంద్రబాబు ఇవన్నీ తెలిసిన వ్యక్తి . అందుకే అవినీతి లేదా పనిచేయని వారిని పక్కకు పెట్టి కొత్తవారికి ఛాన్స్‌ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పుడు పార్టీ మారి టిడిపిలో చేరిన వారికి మళ్లీ పదవీ యోగం ఉంటుందని భావించడానికి లేదు. చంద్రబాబునాయుడు పట్టుబట్టి పాలనను ఎపికి మరలించడంతో పాలనా రంగాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. అమరావతి నిర్మాణ కార్యక్రమాలతో ప్రజల్లో నమ్మకం కలిగించారు. చంద్రబాబు తన మకాంను ఎప్పుడో విజయవాడకు మార్చారు. టిడిపి కార్యాలయాన్ని గుంటూరుకు షిఫ్ట్‌ చేశారు. దీంతో ఎపిలో బలమైన నేతగా నిలబడ్డారు. ప్రజల కూడా తమకు అందుబాటులోనే పాలకులు ఉండాలని కోరకుంటున్నారు. ప్రజలకు ఏనాడు హైదరాబద్‌ వేదికాగా పాలన సాగాలని కోరుకోవడం లేదు. ఇది గమనించే బాబు శరవేగంగా వెలగపూడి నుంచి కార్యాచరణకు దిగారు. ఆయన తీసుకుంటున్న చర్యల కారణంగా ఎపిలో మరింత బలోపేతం అవుతున్నారు. బాబుకు ప్రత్యామ్నాయం అని చెప్పగల నాయకుడు కనిపించడం లేదు. ప్రతిపక్షనేత జగన్మోహన్‌ రెడ్డికి ఒకవర్గం ప్రజలలో ఆదరణ ఉన్నప్పటికీ విపక్షనేతగా రాణించలేక పోతున్నారు. నిర్మాణాత్మక విపక్ష ¬దా కన్నా జగన్‌ ఎక్కువగా అధికార పార్టీని విమర్శించడమే పనిగా రాజకీయాలు నెరపుతున్నారు. కాంగ్రెస్‌లో ఎందరో నాయకులు ఉన్నప్పటికీ వారెవ్వరికీ ప్రజలలో ఆదరణ లేదు. విభజన పాపం వీరిని ఇంకా వెన్నాడుతూనే ఉంది. దీంతో వచ్చేఎన్నికల్లో వీరి ప్రభావం తక్కువనే చెప్పాలి. అందుకే ఒక్కొక్కరుగా వైకాపా నుంచి జారుకుంటున్నారు. రేపటి రోజు ఎవరికి టిక్కటె/- ఇవ్వాలి..ఎవరికి ఇవ్వొద్దన్నది బాబు నిర్ణయమే ఫైనల్‌. అందుకే ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారు. కూడికలు తీసివేతలను మొదలుపెట్టారు.