టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

– కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో దళితుల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
– మాజీ ఎంపీ హర్షకుమార్‌
రాజమండ్రి, జులై2(జ‌నం సాక్షి ) : ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. సోమవారం ఆయన రాజమండ్రిలో విూడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల  కాంగ్రెస్‌ హయాంలో దళితులకు జరిగిన మేలుపై ఉపముఖ్యమంత్రి చినరాజప్పతో బహిరంగ చర్చకు సిద్ధని సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ హయాంలో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎస్సీ-ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించడం వల్లే నేడు టీడీపీ ప్రభుత్వం 40వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. నాడు అసెంబ్లీలో సబళప్లాన్‌కు చట్టబద్ధత బిల్లును టీడీపీ వ్యతిరేకించిందని హర్షకుమార్‌ గుర్తు చేశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి అని ఎద్దేవా చేశారు. దేశం, రాష్ట్రంలోని ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించాయన్నారు. అక్కడ మోదీ, ఇక్కడ చంద్రబాబులు తమ అనూయులకు ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టేందుకే పాలన సాగిస్తున్నారని, పైగా దీక్షలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులకు రక్షణ కరువైందన్నారు. దళితులకు రక్షణగా ఉండే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తుంగలోతొక్కేందుకు కేంద్ర యత్నిస్తుందన్నారు. మోదీ 40 విదేశీ టూర్లకు వెళ్లిన ప్రధాని మోడీ 350 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని హర్షకుమార్‌ ఆరోపించారు.