టీడీపీ సమావేశంలో గందరగోళం
నల్గొండ: హుజూర్‌నగర్ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ఉన్న విబేధాలు బయటపడ్డాయి. టీడీపీ నియోజకవర్గ సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల కార్యకర్తలు కుర్చీలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సమావేశం అర్థాంతంగా ముగింసింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
 
             
              


