టీపీయుఎస్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): టీపీయుఎస్ జిల్లా నూతన అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులుగా పర్వతం సంధ్యారాణి , యామా రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య తెలిపారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన టిపియుయస్ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.రాష్ట్రంలో నెలకొన్న విద్యా రంగ, ఉపాధ్యాయ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించి ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిరక్షించాలని కోరారు.అనంతరం ఆ సంఘ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బెల్లంకొండ రామమూర్తి, జిల్లా కోశాధికారి లింగంపల్లి హరి ప్రసాద్ , శేషగాని శ్రీనివాస్ గౌడ్ , ఉపాధ్యక్షులు బ్రహ్మచారి , దేవరాజ్ , రామినేని శ్రీనివాస్ , బైరు తిరుమలేష్ , బొలిశెట్టి శ్రీనివాస్ , పోతుగంటి శ్రీనివాసా చారి, జూలకంటి వెంకట్ రెడ్డి , తాటికొండ రవీందర్ రెడ్డి, పోతుగంటి శ్రీనివాసా రావు, మన్నే శ్రీదేవి , సుందరి శ్రీను, ఘంటా శ్రీను, సుధాకర్ రావు, రామారావు, సురభి శ్రీధర్ , మిరియాల శంకర్ , ఉపేందర్, ఫణి కుమార్, నవీన్, పూల్ సింగ్, సాయి కుమార్, కృష్ణా రెడ్డి, సుధాకర్, యామా సంతోష్ , గుండా స్వాతి, కోట శ్రీనివాస్ రెడ్డి, సారగండ్ల సురేష్, సుశర్మ, బుచ్చి రెడ్డి, సువర్ణ లక్ష్మి, రజని తదితరులు పాల్గొన్నారు.