టీవీ చూసే ప్రతీ ఒక్కరూ ప్రొటెం స్పీకరే!

– సుప్రీం ఉత్తర్వులు హర్షణీయం
– ట్విట్టర్‌లో మాజీ కేంద్ర మంత్రి చిదంబరం
న్యూఢిల్లీ, మే19( జ‌నం సాక్షి) : బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ‘సుప్రీంకోర్టుకు సెల్యూట్‌ చేస్తున్నాను. విశ్వాస పరీక్షను ఆలస్యం చేయడానికి భాజపా అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పడు యడ్యూరప్పపై కాంగ్రెస్‌, జేడీఎస్‌ తప్పకుండా గెలుస్తాయి అన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా అసెంబ్లీలో జరుగుతున్నదని, టెలివిజన్లలో చూసే ప్రతీ ఒక్క భారతీయుడు ఇప్పుడు ప్రొటెం స్పీకర్‌తో సమానమే అని చిదంబరం ట్వీట్‌ చేశారు. అంతకముందు ఆయన భాజపాను తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. గెలుపు కోసం ఇంకా ఎన్ని గిమ్మిక్కులు చేస్తారు, ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారు  అని చిదంబరం ట్విటర్‌ ద్వారా భాజపాను ప్రశ్నించారు.  బీజేపీ అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తుందని అన్నారు. కర్ణాటకలో ఒక విధంగా, గోవాలో ఒక విధంగా తమ పంతాన్ని నిగ్గించుకోవాలనిచూస్తుందన్నారు. బీజేపీ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ప్రమాదకరమన్నారు. బీజేపీ విధానంతో రాజకీయ నాయకులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుంతుందని,
ఇలాంటి వ్యవహారాలు సరికాదన్నారు. బీజేపీ తనతీరు మార్చుకోకపోతే ప్రజలు ఛీకొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చిందరంబం హెచ్చరించారు.