టూవీలర్‌ను ఢీకొన్న బొలెరో

ఒకరు మృతి..ఇద్దరికి గాయాలు

అనంతపురం,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): రోడ్డుప్రామదంలో ఒకరు దుర్మరణం చెందారు. సోమందేపల్లి మండలం వెలగ మేకలపల్లి గ్రామ మలుపు వద్ద జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం బొలారో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. బెంగళూరు నుంచి అనంతపురం వైపు ఖాళీ ట్రేలతో బొలారో వాహనం వెళ్తుండగా సోమందేపల్లికి చెందిన భాష, రియాజ్‌ మరో వ్యక్తితో కలిసి కొడికొండ చెక్‌పోస్ట్‌ వద్దకు ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. వెలగమేకలపల్లి మలుపు వద్ద బొలారో వాహనం అతి వేగంగా వెళ్తు అదుపు తప్పి డివైడర్‌ను దాటి అటు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. అనంతరం రహదారి పక్కన బోల్తా పడింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భాషా( 38) అక్కడికక్కడే మృతి చెందాడు. రియాజ్‌కు తీవ్ర గాయాలు కాగా మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాసులు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంబులెన్స్‌లో గాయపడిన వారిని పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తాజావార్తలు