టూ వీలర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
తల్లీ కుమారుడు మృతి
ఆదిలాబాద్,జూన్20(జనం సాక్షి ): జిల్లాలోని నేరేడిగొండ మండలం రోల్‌మామడ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దంపతులు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ ఆర్‌టిసి బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లి, ఏడాదిన్నర కుమారుడు మృతి చెందారు. భర్తకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను బోథ్ మండలం కుచులాపూర్ వాసులుగా గుర్తించారు.