టెక్సాస్‌ ఎరువుల కంపెనీలో భారీ విస్ఫోటనం

ఏప్రిల్‌ 18 (జనంసాక్షి) :
అగ్రరాజ్యం అమెరికా వరుస బాంబు పేలుళ్లతో బెంబేలెత్తిపోతుంది. బోస్టన్‌లో జరిగిన పేలుడు ఘటనను మరువకముందే మరో భారీ పేలుడు సంభవించింది. టెక్సాస్‌లోని వాకో దగ్గర ఓ ఎరువుల కంపెనీలో పేలుడు జరిగింది. టెక్సాస్‌లోని వాకో దగ్గర ఓ ఎరువుల కంపెనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మందికి పైగా దుర్మరణం చెందగా, 100మందికిపైగా గాయ పడినట్లు తెలుస్తోంది. వెంటనే వారిని చికిత్స నిమిత్తం పలు ఆసుపత్రలుకు తరలించారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9గంటలకు ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఎమర్జెన్సీ బృందం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. హెలీక్యాప్టర్ల సహాయంతో మంటలు అదుపు లోకి తీసుకవచ్చారు. ఎరువుల కంపెనీలో ఒకసారి పేలుడు జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మాటలు అదుపు చేయడానికి యత్నిస్తున్న మిగతా 2లోసమయంలో మరో పేలుడు జరిగింది. దీంతో పలువురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. పేలుడు శబ్దం 32 కిలోమీటర్ల వరకు వినిపించింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో చుట్టపక్కల ఉన్న ఓ పాఠశాల సహా పలు నివాసాలకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో వాకోచుట్టు ప్రక్కల గల 2600మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. న్యూక్లియర్‌ బాంబు పేలి ఉంటుందని ఆ ప్రాంత మేయర్‌ టామీముస్కా తెలిపారు. పేలుడు తీవ్రత అధికంగా ఉండడంతో కంపెనీ అగ్ని కీలలో దగ్ధమైంది. ఈ ఘటనలో కనీసం 60, 70 మంది మరణించి ఉంటారని వెస్ట్‌ ఎమర్జెన్సీ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జార్జీస్మిత్‌ను ఉటంకిస్తూ ఒక టెలివిజన్‌ ఛానెల్‌ పేర్కొంది. ఆసుపత్రి వర్గాలు కూడా ఇంచుమించుగా ఇదే సమాచారాన్ని అందజేశారు. అయితే ఈ వార్తలను తాను ధృవీకరించడం కానీ, లేక నిరాకరించడం కానీ చేయలేనని టెక్సాస్‌ ప్రజారక్షణ విభాగం అధికార ప్రతినిధి డిఎల్‌ విల్సన్‌ వ్యాఖ్యానించారు. ప్రతీ ఇంటిని తనిఖీ చేస్తున్నామని బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.