టెట్‌ ఫలితాలు విడుదల

2
హైదరాబాద్‌,జూన్‌ 17(జనంసాక్షి):ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీఎస్‌ టెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ సంచాలకులు కిషన్‌ విడుదల చేశారు. పేపర్‌ -1లో 54.45 శాతం ఉత్తీర్ణత, పేపర్‌ -2లో 25.04 శాతం ఉత్తీర్ణత సాధించారు. పేపర్‌ -1లో 134 మార్కులతో స్నేహలత(మెదక్‌ జిల్లా) మొదటి స్థానంలో నిలిచింది. పేపర్‌ -2లో 126 మార్కులతో డి. శారదావాణి(కరీంనగర్‌ జిల్లా) ప్రథమ స్థానంలో నిలిచింది. పేపర్‌ -1లో కరీంనగర్‌ జిల్లా ఫస్ట్‌, రంగారెడ్డి జిల్లా చివరిస్థానంతో సరిపెట్టుకుంది. పేపర్‌-2లో మ్యాథమెటిక్స్‌/సైన్స్‌ విభాగంలో ఖమ్మం జిల్లా ప్రథమ స్థానం, మెదక్‌ జిల్లా చివరిస్థానంలో నిలిచింది. పేపర్‌-2లో సోషల్‌ స్టడీస్‌ లో హైదరాబాద్‌ ఫస్ట్‌, మెదక్‌ చివరిస్థానంతో సరిపెట్టుకుంది. టెట్‌ ఫలితాల కోసం వెబ్‌సైట్‌/-లో చూడాలన్నారు. మే 22న టెట్‌ జరిగిన విషయం విదితమే. పేపర్‌-1లో 87.10 శాతం మంది అభ్యర్థులు, పేపర్‌-2లో 91.83 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్‌-1కు 1,01,213 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 88,158 మంది పరీక్షలు రాశారు. పేపర్‌-2కు 2,74,339 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,51,924 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు.