టెస్ట్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులను సందర్శించిన కమిటీ…

 నర్సంపేట :
రభి ధాన్యం టెస్ట్ మిల్లింగ్ కొరకు ప్రభుత్వం నియమించిన కమిటీ    వరంగల్ జిల్లాలోని నర్సంపేట ప్రాంతంలోని మిల్లులు సందర్శించడం జరిగింది ,
శనివారం నర్సంపేట పరిసరాలలో ఉన్న రైస్ మిల్లు లో ఈ యాసంగి క్రాప్ లో వచ్చినటువంటి ధాన్యము శాంపిల్స్ సేకరిoచినారు , ఈ కమిటీ నందు , జయ దీపు ప్రిన్సిపల్ సైంటఫిక్ ఆఫీసర్ మైసూర్ , శ్రీధర్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ హైదరాబాద్ , హైదరాబాద్ సివిల్ సప్లై కమిషనర్  ఆఫీస్  అశోక్ కుమార్ కన్సల్టెంట్  , విజయ్ భూషణ్ టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ సప్లై కార్పొరేషన్ , హైదరాబాద్  , వరంగల్ జిల్లా డి సి ఎస్ ఓ గౌరీ శంకర్  , సివిల్ సప్లై ఆఫీసర్ డిఎం ఇర్ఫాన్  , వరంగల్ జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తోట సంపత్ కుమార్ , సెక్రెటరీ గోనెల రవీందర్  , కోశాధికారి తక్కెళ్లపల్లి యుగంధర్  , నర్సంపేట ప్రాంత రైస్మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇరుకు కోటేశ్వరరావు  , ప్రధాన కార్యదర్శి విభూతి శివ కుమార్ , కోశాధికారి కోమండ్ల భూపాల్ రావు   ఇతర మిల్లర్ల్లు పాల్గొన్నారు , ప్రాథమికంగా బండారి ఇండస్ట్రీస్  హే మాతా పార బాయిల్డ్ రైస్ మిల్లుల నుండి యసంగి ధాన్య సేకరణలో భాగంగా మిల్లులకు వచ్చిన 1010   ధాన్యము నమూనాలు సేకరించారు . తర్వాత దశలో మిల్లుల వద్ద టెస్ట్ మిల్లింగ్ చేసి పూర్తి నివేదిక అందిస్తామని కమిటీ సభ్యులు ప్రకటించారు.