టోకెన్‌ కోసం కాలయాపన

మండిపడుతున్న తాత్కాలిక సిబ్బంది

వనపర్తి,నవంబరు18 (జనం సాక్షి) :  ఆర్టీసీ సమ్మెతో వనపర్తి డిపోలో టోకెన్‌ పేరుతో తాత్కాలిక డ్రైవర్లకు కండక్టర్లకు తీరని కష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు. టోకన్ల కొరకు తెల్లవారుజామున 3గంటలనుండిలేడీ కండక్టర్లను బస్‌డిపో బయట కూర్చోబెట్టి 8 తర్వాత విూకు ఇవ్వడానికి, డ్యూటీ ఇవ్వడానికి వీలు లేదని కండక్టర్లతో అంటున్నారు. ఇల్లు గడవక ఇలా డ్యూటీ చేస్తున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు. న్యాయమైన కోరికలు కోసం వారు చేసిన ధర్నాకు మేము మద్దతు తెలుపుతున్నాం. మా ఇల్లు గడవక ఆర్థిక ఇబ్బందులతో డ్యూటీలు చేస్తున్నామని అర్థంచేసుకోవాలని అన్నారు. తాత్కాలిక కండక్టర్‌ డ్రైవర్ల సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని ఉంది కానీ మా ఆర్థిక ఇబ్బందులు మా సమస్యలతో సర్దుకుని డ్యూటీ చేస్తున్నామని తెలిపారు.